Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల, ఇలా బుక్ చేసుకోండి
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. రేపు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు ప్రకటించింది. సోమవారం ఉదయం 10 గంటలకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వ తేదీ వరకు చెందిన టికెట్లు విడుదల కానున్నాయి. రోజుకు 20 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇక.. ఎల్లుండి వసతి గదుల కోటా విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ వరకు గదులను విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ఏకాదశి దర్శనం:
ఇదిలావుండగా.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 2 నుంచి పదిరోజుల పాటు టీటీడీ టోకెన్లను జారీ చేసిన సంగతి తెలసిందే. జనవరి 2 నుంచి 11 వరకు టోకెన్లను విడుదల చేసింది. టోకెన్లు కలిగిన వారే దర్శనానికి రావాలని టీడీపీ ముందే చెప్పడంతో భక్తులకు సంతృప్తికరంగా దర్శనం జరుగుతోంది. అయితే జనవరి 12 నుంచి మిగిలిన రోజులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ పెండింగ్‌లో పెట్టింది.
కొత్త ఛైర్మన్ రేసులో భూమన కరుణాకర్ రెడ్డి:
అంతా బాగానే వుంది కానీ..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌కు కాబోయే కొత్త ఛైర్మన్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ వర్గాలు చెబుతున్న దానిని బట్టి .. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భూమనకు గతంలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం వుంది. ఇదే సమయంలో పల్నాడు జిల్లా గురజాలకు చెందిన , బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు కూడా టీటీడీ ఛైర్మన్ రేసులో వినిపించింది. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయన వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా వున్న కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం వల్ల తాము బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను జగన్ పంపాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి భూమన, జంగా లలో జగన్ ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com