TTD:భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. బ్రేక్ దర్శనాలు రద్దు..
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం కొండపైకి భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికలు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ కారణంగా.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వరకు బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇవాళ కూడా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు.
విపరీతమైన రద్దీతో దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. వీరు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. మరోవైపు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. ఈ మూడు రోజులు రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments