TTD:భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం.. బ్రేక్ దర్శనాలు రద్దు..

  • IndiaGlitz, [Friday,May 24 2024]

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.. గత వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం కొండపైకి భక్తులు బారులు తీరారు. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికలు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30 వరకు శుక్ర, శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ కారణంగా.. దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.

సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వరకు బ్రేక్‌ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇవాళ కూడా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు.

విపరీతమైన రద్దీతో దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. వీరు స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. మరోవైపు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. ఈ మూడు రోజులు రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా భక్తులకు దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

More News

KTR:సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని కోర్టుకు లాగుతాం.. కేటీఆర్ వార్నింగ్..

బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

BJP Leader Son:ఆస్ట్రేలియాలో తెలంగాణ బీజేపీ నేత కుమారుడు మృతి

ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన

Pinnelli:హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. అజ్ఞాతం వీడనున్నారా..?

పోలింగ్ ముగిసినా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు మాత్రం ఇంకా తగ్గడం లేదు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని

Buddha Venkanna:లోకేష్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలి.. బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలని

Karate Kalyani:డ్రగ్స్‌ టెస్టులో హేమకు పాజిటివ్.. సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం

తెలుగు న‌టి హేమ బెంగుళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీకి హేమతో