TTD Hundi Collection : కాసులు కురిపిస్తోన్న తిరుమల శ్రీవారి హుండీ... జూలైలో రూ.139.33 కోట్ల ఆదాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డులను బద్ధలు కొట్టింది. జూలై నెలలో హుండీ ద్వారా ఏకంగా రూ.139.33 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. 23.40 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా... 1.07 కోట్ల లడ్డూలను విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది. అలాగే 53.41 లక్షల మంది శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 10.97 లక్షల మంది తలనీలాలు సమర్పించారు.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 74,497 మంది భక్తులు:
ఇకపోతే.. తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి వున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం 74,497 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.5.15 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆ నెలలో తిరుమల రావొద్దు:
మరోవైపు.. వేసవి రద్దీ తగ్గినప్పటికీ పెళ్లిళ్లు, పండుగల సీజన్‌తో పాటు ఈ నెల 19 వరకు సెలవులు వుండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం వుంది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 17 వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వుండటంతో యాత్రికుల రద్దీ పెరిగే అవకాశం వుందని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారుల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.05 గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు కోవిడ్ రూల్స్ పాటించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments