శ్రీవారి భక్తులారా సహకరించండి : టీటీడీ ఈవో
Send us your feedback to audioarticles@vaarta.com
‘కరోనా’ మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి నిర్ణయాలు వెల్లడించారు.
‘వారం రోజులు పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు. శ్రీవారికి యథాతథంగా కైంకర్యలు ఏకాంతగా నిర్వహిస్తాం. టీటీడీ అనుబంధ ఆలయలకు తాత్కాలిక భక్తులకు ప్రవేశం లేదు, నిత్య కైంకర్యలు యథాతథంగా నిర్వహిస్తాం. ఎస్విబిసి టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారం జరిగే కార్యక్రమాలు అలాగే వుంటాయి. 1892 రెండు రోజులు కొన్ని కారణాల వల్ల మొత్తం ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికీ వరకు తిరుమలలో వున్న భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాం. రేపు ఉదయం ఆర్జిత కలిగిన వారికి దర్శనం వుంటుంది. మధ్యాహ్నం నుండి భక్తులకు ప్రవేశం లేదు’ అని అనిల్ కుమార్ మీడియా ముఖంగా శ్రీవారి భక్తులకు విన్నవించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout