TTD EO Dharmareddy : టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు.. వచ్చే నెలలో పెళ్లి, అంతలోనే

  • IndiaGlitz, [Monday,December 19 2022]

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (శివ) గుండెపోటుకు గురయ్యారు. ఆయన వయసు 28 సంవత్సరాలు. గుండెపోటుకు గురైన వెంటనే శివను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి నిశ్చితార్ధం జరగ్గా.. జనవరిలో వీరి వివాహం జరగాల్సి వుంది.

శుభలేఖలు పంచేందుకు చెన్నైకి :

దీంతో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా వుండటంతో పాటు శుభలేఖలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ఆళ్వారుపేటలో బంధువులకు పెళ్లిపత్రికలు ఇవ్వడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన కారులో నగరానికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే గుండెలో నొప్పిగా వుందని కారులోనే వున్న స్నేహితుడితో చెప్పగా... శివను కావేరి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ధర్మారెడ్డి దంపతులు, కాబోయే వియ్యంకుడు శేఖర్ రెడ్డిలు కావేరి ఆసుపత్రికి వెళ్లారు. వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి‌లు కూడా కావేరి ఆసుపత్రికి వెళ్లారు. అయితే కొడుకు పరిస్ధితిని చూడగానే ధర్మారెడ్డి కళ్లు తిరిగి పడిపోవడంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

వైద్యులు ఏమన్నారంటే:

మరోవైపు చంద్రమౌళి ఆరోగ్య పరిస్ధితిపై కావేరి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనను 18వ తేదీ ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే చంద్రమౌళి పరిస్ధితి విషమంగా వుండటంతో సీపీఆర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే క్యాత్‌లాబ్‌కు తరలించి .. ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు కావేరి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  నిపుణులైన వైద్య బృందం చంద్రమౌళికి చికిత్స అందిస్తోందని.. అత్యంత క్లిష్ట సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కావేరి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

More News

Bigg Boss Telugu: ఆటపాటలు, భావోద్వేగాల కలబోత .. బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే హైలైట్స్

దాదాపు 15 వారాల నుంచి ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ 6 తెలుగుకు తెరపడింది. ఈ సీజన్ విజేతగా రేవంత్ , రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఆటపాటల మధ్య సందడిగా సాగింది.

Bigg boss 6 Telugu : బిగ్‌బాస్ 6 విజేత రేవంత్.. రూ.40 లక్షలతో జాక్‌పాట్ కొట్టిన శ్రీహాన్

అందరూ అనుకున్నదే జరిగింది. బిగ్‌బాస్ 6 తెలుగు విజేతగా సింగర్ రేవంత్ నిలిచారు.

BiggBoss6:హౌస్‌లో సందడి చేసిన మాజీలు... ‘‘స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌’’గా శ్రీహాన్

మరో రోజులో బిగ్‌బాస్ 6 తెలుగుకి తెరపడనుంది. మరికొద్దిగంటల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ కావడంతో ఇంట్లో ఐదుగురు మిగిలారు.

Butta Bomma: 26, జనవరి 2023 'బుట్ట బొమ్మ' విడుదల

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  'సితార ఎంటర్ టైన్ మెంట్స్' ,

Venkaiah Naidu: తానా వారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలను సన్మానించడం ఎంతో అభినందనీయం : వెంకయ్య నాయుడు

ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ  తెలుగు వారి కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఏర్పాటైన ప్రసిద్ధి సంస్థ 'ఉత్తర అమెరికా తెలుగు సంఘం'