Tirumala:తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు : టీటీడీ ఉచిత బస్సు చోరీ, టైట్ సెక్యూరిటీ మధ్య ఎలా కొట్టేశారబ్బా
Send us your feedback to audioarticles@vaarta.com
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులను తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి తరలించేందుకు టీటీడీ ఉచిత బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. స్వామి వారి దర్శనానికి వచ్చే పేదలు ఈ ఉచిత సర్వీసుల ద్వారా తిరుమల కొండకు చేరుకుని.. శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి తిరుపతికి చేరుకుంటారు. అలాగే తిరుమల క్షేత్రంలోని దర్శనీయ స్థలాలకు కూడా టీటీడీ ఉచిత బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇంతటి ప్రాముఖ్యత వున్న ఈ ఉచిత ధర్మరథం చోరీకి గురి కావడం కలకలం రేపుతోంది. దుండగుడు పక్కా స్కెచ్‌తో ఈ ఎలక్ట్రిక్ బస్సును ఎత్తుకుపోయాడు. టీటీడీ రవాణా శాఖ, విజిలెన్స్ విభాగాల వైఫల్యంతో దుండగుడు అత్యంత చాకచక్యంగా బస్సును చోరీ చేశాడు. అయితే దొరికిపోతాననే భయంతో ఈ బస్సును నాయుడుపేట బైపాస్ రోడ్డులో వదిలి పారిపోయాడు.
జీపీఎస్ ట్రాకింగ్‌తో బస్సును కనిపెట్టిన పోలీసులు :
వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఛార్జింగ్ స్టేషన్ వాద్ద బస్సుకు ఛార్జింగ్ పెట్టిన డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇదే అదనుగా దుండగుడు బస్సును కొట్టేశాడు. ఆదివారం ఉదయం ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిలిపి వుంచిన బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ రవాణా శాఖ, విజిలెన్స్ , పోలీసులు బస్సును గాలించే పనులు మొదలుపెట్టారు. అదృష్టవశాత్తూ టీటీడీ కొత్తగా కొనుగోలు చేసిన బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ వుండటంతో బస్సు నాయుడుపేట వద్ద వుందని పోలీసులు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో భద్రతా వైఫల్యంపై మరోసారి చర్చనీయాంశం:
అయితే ఈ ఘటనా తిరుమలలో భద్రతా వైఫల్యాలను తేటతెల్లం చేసింది. పటిష్టమైన భద్రత వుంటే తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో స్వయంగా స్వామివారి బస్సునే కొట్టేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల ఉగ్రవాదులు, ఇతర సంఘ విద్రోహ శక్తుల హిట్‌లిస్ట్‌లో వున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు నిత్యం ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారి దర్శనానికి విచ్చేస్తూ వుంటారు. అలాంటిది ఏదైనా జరగరానిది జరిగితే అందరూ చింతించాల్సి వస్తుంది. ఇకనైనా టీటీడీ తన భద్రతా వైఫల్యాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com