YV Subba Reddy:శ్రీవాణి ట్రస్ట్‌పై పవన్ ఆరోపణలు .. ఇవిగో లెక్కలు : శ్వేతపత్రం విడుదల చేసిన వైవీ సుబ్బారెడ్డి

  • IndiaGlitz, [Friday,June 23 2023]

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా పరిగణించారు. అందరి అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు విపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. దీనిలో భాగంగా శ్రీవాణి ట్రస్ట్‌ కార్యకలాపాలు, ఆదాయ వ్యయాలపై టీటీడీ శ్వేత పత్రం విడుదల చేసింది.

మే 31 వరకు రూ.861 కోట్ల నిధులు :

ఈ ఏడాది మే 31 వరకు శ్రీవాణి ట్రస్టుకు 861 కోట్లు నిధులు వచ్చాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది. రోజూవారీ వచ్చే డబ్బు 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉందని, డిపాజిట్లపై వడ్డీ రూపంలో 36.50 కోట్లు వచ్చిందని టీటీడీ వివరించింది. దేవాలయాల నిర్మాణం , పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ఇప్పటిదాకా 120.24 కోట్లు ఖర్చు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తప్పవు :

రాజకీయ లబ్ధి కోసమే శ్రీవాణీ ట్రస్ట్‌పై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. శ్రీవాణి ట్రస్ట్‌పై ఆరోపణలు చేసినవారిపై న్యాయసలహా తీసుకొని కచ్చితంగా కేసులు పెడతామని ఆయన హెచ్చరించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసేవారు ఎంతటి వారైనా సరే అవినీతి చేయడానికి భయపడాల్సిందేనని, తప్పు చేస్తే తానైనా సరే శిక్ష పడాల్సిందేనని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఏపీతో సహా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు 139 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు.

శ్రీవాణి టికెట్‌ రూ.10 వేలు.. వెయ్యి వెంకన్నకి, మిగిలిన రూ.9 వేలు ఏమవుతున్నాయి :

వారాహి విజయయాత్రలో భాగంగా పిఠాపురంలో ఇటీవల జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందన్నారు. శ్రీవాణి ట్రస్టు అని దర్శనం కోసం పెట్టారని.. రూ.10 వేలు కడితే దర్శనం ఉంటుందన్నారు. అయితే కట్టిన డబ్బుకు బిల్లు ఉండదని.. కేవలం రూ.1000 మాత్రమే టిక్కెట్ కేటాయించినట్లు లెక్కలుంటాయని, మిగిలిని రూ.9 వేలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏడుకొండల స్వామితో ఆటలాడుతున్నారని.. నామరూపాలు లేకుండా పోతారని ఆయన హెచ్చరించారు. హిందూ ఆలయాలు, వాటి ఆస్తుల మీద వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని దేవాదాయశాఖను నిర్వీర్యం చేశారని పవన్ మండిపడ్డారు. కేవలం ఆలయాల వద్ద ఉన్న ఆస్తులను కాజేయడానికి ఈ ప్రభుత్వం చూస్తోందని జససేనాని ఆరోపించారు.

More News

Pawan Kalyan:ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇన్ని ఘోరాలా.. జనసేన వస్తే సుభిక్ష ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mudragada Padmanabham:నేను నీ బానిసను కాను.. కాకినా, పిఠాపురంలో పోటీకి సిద్ధమా : ఈసారి పవన్‌పై రెచ్చిపోయిన ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా మరో లేఖ సంధించారు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.

గంజాయికి ఏపీని హబ్‌గా మార్చారు.. అడ్డుకున్నారనే కక్షతో గౌతం సవాంగ్‌పై వేటు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో

Janasena Chief Pawan:మాట్లాడితే క్లాస్ వార్ అంటాడు.. ఆయనేం చేగువేరా, కొండపల్లి, పుచ్చలపల్లి కాదు : జగన్‌పై పవన్ ఆగ్రహం

నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశాడని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

YS Jagan:ఏపీకి రూ.1,425 కోట్ల పెట్టుబడులు .. ఒకే రోజు 3 కంపెనీలకు జగన్ శంకుస్థాపన , 2500 మందికి ఉపాధి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మక పెట్టుబడి వచ్చింది. రూ.1425 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్‌లకు సీఎం వైఎస్ జగన్ గురువారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.