టీటీడీ పాలకమండలి సభ్యులు ఖరారు.. జగన్ సమన్యాయం!
- IndiaGlitz, [Tuesday,September 17 2019]
టీటీడీ చైర్మన్‌గా వైసీపీ సీనియర్, వైఎస్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పాలకమండలి సభ్యులను పెండింగ్‌లో పెట్టిన సర్కార్.. మంగళవారం నాడు సభ్యుల పేర్లు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది. ఇదివరకున్న 16 మంది సభ్యులు కాకుండా సంఖ్యపెంచిన ప్రభుత్వం.. అది కాస్త 28కి పెంచింది. ఈ మొత్తం సభ్యుల్లో.. ఏపీ నుంచి 8మంది, తెలంగాణ 7 మంది, తమిళనాడు నుంచి 4, కర్ణాటక నుంచి 3, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొకరు చొప్పున పాలకమండలిలిలో అవకాశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ఓ ప్రకటనలో సర్కార్ తెలిపింది. అయితే త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని తెలుస్తోంది.
తెలంగాణ నుంచి ఎవరెవరు!?
- రామేశ్వరరావు
- బి.పార్థసారథిరెడ్డి
-వెంకటభాస్కరరావు
- మూరంశెట్టి రాములు
- డి.దామోదరరావు
- కె.శివకుమార్
-పుట్టా ప్రతాప్‌రెడ్డి
ఏపీ నుంచి ఎవరెవరు!?
- గొల్ల బాబూరావు
- నాదెండ్ల సుబ్బారావు
- ప్రశాంతి
- యూవీ రమణమూర్తి
- మల్లికార్జునరెడ్డి
- డీపీ అనంత
- చిప్పగిరి ప్రసాద్‌కుమార్
- పార్థసారథి
ఇదిలా ఉంటే.. ఢిల్లీ నుంచి శివశంకరన్, మహరాష్ట్ర నుంచి రాజేష్ శర్మ, కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తిలకు అవకాశం దక్కింది. ఇదిలా ఉంటే తిరుపతికి పక్కనే ఉన్న తమిళనాడు నుంచి మాత్రం ఒకరిద్దరూ కాదు ఏకంగా నలుగుర్ని తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. వీరిలో వైద్యనాథన్, శ్రీనివాసన్, డా.నిశ్చిత, కుమారగురు ఉన్నారు.
సమన్యాయం!
మొత్తానికి చూస్తే ఏపీకి చుట్టుపక్కల ఉండే అన్ని రాష్ట్రాలకు సీఎం వైఎస్ జగన్ సమన్యాయం చేశారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు పాలకమండలిలో స్థానం ఆశించిన వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..!