Chaganti Koteswara Rao : చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీలో కీలక పదవి..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కీలకపదవి దక్కింది. హిందూ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ఆయనను నియమించింది. ఈ మేరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి.
టీటీడీ కార్యక్రమాలను ప్రపంచానికి తెలియజేయాలన్న సుబ్బారెడ్డి:
అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రి అందించాలని, హోమాలు, యాగాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. దీనితో పాటు టీటీడీ అందిస్తున్న ప్రపంచస్థాయి వైద్య సౌకర్యాలను సాధారణ ప్రజలకు తెలిసేలా స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యక్రమాలను ప్రసారం చేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు.
ఉద్యోగం చేస్తూనే ధర్మ ప్రచారం చేస్తోన్న చాగంటి :
ఇకపోతే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1958 జూలై 14న జన్మించిన చాగంటి కోటేశ్వరరావు హిందూ ధర్మ ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు. దీనితో పాటు భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని ఈ తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూనే ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు చాగంటి కోటేశ్వరరావు. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో భారతదేశ వ్యాప్తంగా విశేషంగా అభిమానులున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments