15 తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడుస్తుంది : కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో 15 తర్వాత ఆర్టీసీ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆటోలు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిగా అవకాశం ఉంటుందన్నారు. ఆరెంజ్ జోన్లలో మాత్రం క్యాబ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందని సీఎం తెలిపారు. ఎవరైనా చనిపోతే 10 మంది అంత్యక్రియలు జరగాలన్నారు. అదే విధంగా వివాహాలు ఉంటే మాత్రం కేవలం 20 మందితోనే జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేస్తామన్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసలు రాష్ట్రంలో వేటికి అనుమతి ఉంది.. వేటిపై నిషేధం అనే విషయాలను నిశితంగా మీడియా ముఖంగా ప్రజలకు ఆయన వివరించారు. అదేవిధంగా ఆర్టీసీపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.
లాక్ తీస్తే నదిలానే..!
‘ముంబై, ఢిల్లీ, చెన్నైలో అసలేం జరుగుతోందని విషయాలు మనకు త్వరలోనే తెలుస్తాయి.. దాన్ని బట్టి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది తెలుస్తుంది.. దాన్ని ఉదాహరణగా తీసుకుని ముందుకెళ్తాం. హైదరాబాద్‌లో లాక్ తీస్తే వాహనాల ఫ్లడ్ ఉండిపోతుంది. వాహనాలు జాతరలాగా తిరుగుతాయి. నది ఎలా ప్రవహిస్తుందో నగరంలో వాహనాలు అలా ప్రవహిస్తాయి. భౌతిక దూరం అస్సలే ఉండదు. ఇలాంటి పరిస్థితి నుంచి పోలీసులు కూడా నగరాన్ని కాపాడలేరు. భాగ్యనగరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే 15 వరకూ ఆర్టీసీ నడపం.. ఆ తర్వాత నడిపే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా కరోనా తగ్గుముఖం పట్టింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కేసీఆర్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com