రాధేశ్యామ్‌ను వాడేసిన సజ్జనార్.. ప్రభాస్‌తో పూజ ఏం చెప్పిందంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, బస్ స్టేషన్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, పెళ్లికి ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్న జంటలకు బహుమతులు అందించడం, మహిళలు, బాలికలకు ప్రత్యేక సేవలు వంటి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా సజ్జనార్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే.. ఆ స్టార్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - పూజా హేగ్డే జంటగా నటించిన ‘‘రాధేశ్యామ్’’ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. దీంతో రాధేశ్యామ్ క్రేజ్‌ను వాడుకోవాలనుకున్నారు సజ్జనార్. దీనిలో భాగంగా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం అని తెలియజెప్పేలా రాధేశ్యామ్ పోస్టర్‌తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఇందులో ప్రభాస్- పూజా హెగ్డే ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటున్నట్లు రూపొందించారు. చాలా రోజుల తర్వాత కలిశాం.. ఎటైనా టూర్ వెళదామా అని ప్రభాస్ అడగ్గా... వెళదాం కానీ ఆర్టీసీ బస్సులోనే వెళదాం.. అందులో అయితేనే ప్రయాణం సురక్షితం అంటూ పూజా హెగ్డే ప్రభాస్‌కి చెబుతుంది. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఏదేమైనా వాడకమంటే సజ్జనార్‌దే.
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport @TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 10, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com