Viral Video: ఆర్టీసీ బస్సు వెనుక కాలు పెట్టి యువకుడి బైక్ డ్రైవింగ్.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ తనదైన వ్యూహాలతో సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, బస్ స్టేషన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, పెళ్లికి ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్న జంటలకు బహుమతులు అందించడం, మహిళలు, బాలికలకు ప్రత్యేక సేవలు వంటి వాటి ద్వారా ఆర్టీసీ బస్సులను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా సజ్జనార్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే విలేజ్ బస్ ఆఫీసర్ల పేరిట కొత్త ప్రయోగానికి కూడా సజ్జనార్ శ్రీకారం చుట్టారు. మే ఒకటి నుంచి విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థ రాష్ట్రమంతటా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సమకాలీన అంశాలపైనా సజ్జనార్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వుంటారు.
బస్సును నెడుతున్నట్లుగా స్టంట్ :
ఇదిలావుండగా.. కొంతమంది ఆకతాయిలు రోడ్ల మీద బైక్పై రకరకాల విన్యాసాలు చేస్తూ వుంటారు. వీరు తమకు తాముగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఎదుటివారిని కూడా ప్రమాదంలో పడేస్తూ వుంటారు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు బైక్ నడుపుతూ ఓ కాలుని ఆర్టీసీ బస్సు మీద పెట్టి వెళ్తున్న వీడియోని సజ్జనార్ షేర్ చేశారు. హైదరాబాద్ మిథానీ డిపోనకు చెందిన సిటీ బస్సు 104-ఎ రూట్లో వెళ్తుండగా.. ఓ ఆకతాయ బైక్ నడుపుతూ ఓ కాలుతో బస్సు వెనక భాగాన్ని నెడుతున్నట్లుగా ఆ వీడియో వుంది.
యువతకు సజ్జనార్ వార్నింగ్ :
‘‘ వెర్రి వేయి విధాలు అంటే ఇదే! సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి ’’ అంటూ సజ్జనార్ యువతకు సూచించారు. అంతేకాదు.. ఇలాంటి చర్యలను టీఎస్ఆర్టీసీ ఉపేక్షించదని .. అలాంట వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే!
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే!
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 2, 2023
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.#RoadSafety @MORTHIndia pic.twitter.com/24GFCp8vvX
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments