టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ ( 2015-16)
Saturday, March 4, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహింపబడే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ 2015-16 సంవత్సరానికిగానూ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల సినిమాలకు ఈ అవార్డులనిస్తారు. శుక్రవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో 2015-16కు సంబంధించిన నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పివిపి, జయసుధ, మీనా, పింకీ రెడ్డి, జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కళ బంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ``కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డులను నిర్వహిస్తున్నాం. అందుకు ప్రతి కేటగిరీలో సినిమాను ఎంపిక చేశాం. మార్చి 8 నుండి నెలరోజుల పాటు జరిగే ఎస్.ఎం.ఎస్ పోల్ ద్వారా ప్రేక్షకులు తమకు నచ్చిన వారికి ఈ అవార్డును వచ్చేలా చేయవచ్చు. విశాఖలో 50వేల మంది ప్రేక్షకుల మధ్య ఈ అవార్డు వేడుకను నిర్వహిస్తాం`` అన్నారు.
పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ - ``సుబ్బరామిరెడ్డిగారు నిర్వహించే అవార్డులకు ప్రత్యేకత ఉంటుంది.ఎన్నో వేడుకలు చూశాం. కానీ పబ్లిక్‌లో ఇంత బారీ వేడుకను నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి అవుతుంది. ఏప్రిల్ 8న ఈ భారీ వేడుక జరగనుంది`` అన్నారు.
బి.గోపాల్ మాట్లాడుతూ - ``ఈ టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రజల సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం`` అన్నారు.
పింకీ రెడ్డి మాట్లాడుతూ - ``నేను చిన్నప్పటి నుండి సినీ తారలను చూస్తూ పెరిగాను. నాన్నగారికి సినీతారలతో ఎంతో మంచి అనుబంధం ఉంది. వారిని సత్కరిస్తూ ఉంటారు. అలాగే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌ను నిర్వహిస్తున్నారు. వైజాగ్‌లో ఏప్రిల్ 8న చేయనున్న టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం`` అన్నారు.
జీవిత మాట్లాడుతూ - `` టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ కమిటీలో జ్యూరీ మెంబర్‌గా కొనసాగుతున్నాను. వైజాగ్‌లో వేల మంది జనాల మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
మీనా మాట్లాడుతూ - `` టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్‌లో నేను కూడా జ్యూరీ మెంబర్‌గా ఉన్నాను. సుబ్బరామిరెడ్డిగారు ఏం చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. కచ్చితంగా ఏప్రిల్‌లో జరగనున్న ఈ వేడుక భారీగా జరుగుతుంది`` అన్నారు.
జయసుధ మాట్లాడుతూ - ``కళలంటే సుబ్బరామిరెడ్డిగారికి ఎంతో మక్కువ. గతేడాది ఈ అవార్డ్స్ ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా వైజాగ్‌లో ఈ అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు వేసి సపోర్ట్ చేయాలి`` అన్నారు.
టి.ఎస్.ఆర్ - టి.వి.9 అవార్డ్స్ 2015
బెస్ట్ హీరోః
ప్రభాస్ - బాహుబలి, మహేష్ - శ్రీమంతుడు, అల్లు అర్జున్ - సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, బాలకృష్ణ - లయన్
బెస్ట్ హీరో - డెబ్యూ
అఖిల్ - అఖిల్, ఆకాష్ పూరి - ఆంధ్రాపోరి, నాగ అన్వేష్ - వినవయ్యా రామయ్యా, సత్య కార్తీక్ - టిప్పు
బెస్ట్ హీరోయిన్ః
సమంతః సన్నాఫ్ సత్యమూర్తి, తమన్నా- బాహుబలి, బెంగాల్ టైగర్, త్రిష - లయన్, రకుల్ ప్రీత్ సింగ్ - పండగ చేస్కో, శృతిహాసన్ః శ్రీమంతుడు
బెస్ట్ హీరోయిన్ - డెబ్యూ
సయేషా సైగల్ - అఖిల్, ప్రగ్యా జైశ్వాల్ - కంచె, మాళవిక నాయర్ - ఎవడే సుబ్రమణ్యం, సుకృతి - కేరింత
బెస్ట్ యాక్టర్(ఫిమేల్)ః
అనుష్క - రుద్రమదేవి, కాజల్ అగర్వాల్ - టెంపర్, సర్దార్ గబ్బర్ సింగ్, నిత్యామీనన్ః మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రేయ - గోపాల గోపాల, రాధికా అప్టే - లయన్, అనుష్క - సైజ్ జీరో, రెజీనా - సుబ్రమణ్యం ఫర్ సేల్
బెస్ట్ ఫిలింః
బాహుబలి - వై.శోభు, ప్రసాద్ దేవినేని, శ్రీమంతుడు - వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్, మహేష్‌బాబు, సన్నాఫ్ సత్యమూర్తి - ఎస్.రాధాకృష్ణ, రుద్రమదేవి - గుణశేఖర్, కంచె - వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు
బెస్ట్ డైరెక్టర్ః
ఎస్.ఎస్.రాజమౌళి - బాహుబలి, గుణశేఖర్ - రుద్రమదేవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ - సన్నాఫ్ సత్యమూర్తి, కొరటాల శివ - శ్రీమంతుడు, క్రిష్ - కంచె,
బెస్ట్ విలన్ః
ప్రభాకర్- బాహుబలి, సంపత్ -శ్రీమంతుడు, సన్నాప్ సత్యమూర్తి, ముఖేష్ రుషి - శ్రీమంతుడు, ప్రకాష్ రాజ్ - టెంపర్, ఆదిత్య మీనన్ - లయన్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ః
ఎం.ఎం.కీరవాణిః బాహుబలి, దేవిశ్రీప్రసాద్ - శ్రీమంతుడు, సన్నాఫ్ సత్యమూర్తి, ఇళయరాజా - రుద్రమదేవి, మణిశర్మ - లయన్, ఎస్.ఎస్.థమన్ - కిక్2, బ్రూస్ లీ, డిక్టేటర్
బెస్ట్ కమెడియన్ః
బ్రహ్మానందంః సన్నాప్ సత్యమూర్తి, అలీ - సన్నాఫ్ సత్యమూర్తి, పోసాని కృష్ణమురళి - గోపాల గోపాల, శ్రీనివాస్ రెడ్డి - పటాస్, వెన్నెల కిషోర్ - భలే భలే మగాడివోయ్
బెస్ట్ సింగర్(మేల్)
రేవంత్ - బాహుబలి(మనోహరి), దేవిశ్రీప్రసాద్ - సన్నాఫ్ సత్యమూర్తి (సూపర్ మచ్చి), రఘు దీక్షిత్ - శ్రీమంతుడు(జాగో జాగో), మోహిత్ చౌహాన్ - ఎవడే సుబ్రమణ్యం(ఓ మనిషి), సచిన్ వారియర్ - భలే భలే మగాడివోయ్( మొట్ట మొదటిసారి)
బెస్ట్ సింగర్(ఫిమేల్)
యామిని - బాహుబలి(మమతల తల్లి), గీతామాధురి - బాహుబలి(జీవనది), శ్రేయా ఘోషల్ - రుద్రమదేవి(పున్నమి పువ్వై), కంచె(నిజమేనని నమ్మని), కె.ఎస్.చిత్ర - మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు(మహరుబా), రేణుక - భలే భలే మగాడివోయ్(ఎందరో మహానుబావులు)
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments