ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

  • IndiaGlitz, [Friday,October 18 2019]

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు.. అయితే ఆర్టీసీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్ ఇలా దొందూ దొందుగా ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళసై, మరోవైపు హైకోర్టులో పిటిషన్ వేసిన ఆర్టీసీ యూనియన్, జేఏసీ ఆశ్రయించింది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేసీఆర్‌కు ఒకింత షాక్ అని చెప్పుకోవచ్చు.

సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే పలు యూనియన్లు, ఎన్జీవోలు, ప్రైవేట్ క్యాబ్స్ యూనియన్స్ మద్దతు తెలిపాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులు, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని న్యాయస్థానం ఒకింత కేసీఆర్ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ సందర్భంగా.. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే..ఎందుకు ఆపలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానంగా కొత్త ఆర్టీసీ ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం పేర్కొంది.

More News

బుల్లితెర రంగంలో విషాదం.. ‘బుల్లి బాలయ్య’ కన్నుమూత

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలిన సంగతి తెలిసిందే. ఆర్ఎంపీ ఆస్పత్రి చూసినా.. ఎంబీబీఎస్ ఆస్పత్రి చూసిన జ్వరాలొచ్చిన జనాలతో కిటకిటలాడుతున్నాయి.

'విజిల్‌' అక్టోబ‌ర్ 25న రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజ‌య్‌`.

'జార్జ్ రెడ్డి' నైజాం రైట్స్ సొంతం చేసుకున్న గ్లోబల్ సినిమాస్

ట్రైలర్ తో అంచనాలు పెంచిన జార్జిరెడ్డి సినిమాకు బిజినెస్ పరంగా మంచి ఆఫర్లు వస్తున్నాయి..ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ ను ఇటీవలే అభిషేక్ పిక్చర్స్

'సాహో' నిర్మాత‌ల‌పై కేసు

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `సాహో`. యు.వి.క్రియేష‌న్స్ నిర్మించిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుద‌లైంది.

అజర్ బేజాన్ వెళ్లనున్న కార్తికేయ, నేహా సోలంకి

హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ml లోని మొదటి పాట "ఇనిపించుకోరు ఇనిపించుకోరు" ఇటీవల విడుదలయి అబ్బాయిలకి తెగ నాచేస్తోంది .