ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు.. అయితే ఆర్టీసీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్ ఇలా దొందూ దొందుగా ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళసై, మరోవైపు హైకోర్టులో పిటిషన్ వేసిన ఆర్టీసీ యూనియన్, జేఏసీ ఆశ్రయించింది. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేసీఆర్‌కు ఒకింత షాక్ అని చెప్పుకోవచ్చు.
సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరైనది కాదని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆర్టీసీ సమ్మెకు ఇప్పటికే పలు యూనియన్లు, ఎన్జీవోలు, ప్రైవేట్ క్యాబ్స్ యూనియన్స్ మద్దతు తెలిపాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులు, వాళ్లు తిరగబడితే ఎవరూ ఆపలేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని న్యాయస్థానం ఒకింత కేసీఆర్ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ సందర్భంగా.. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే..ఎందుకు ఆపలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనికి సమాధానంగా కొత్త ఆర్టీసీ ఎండీని నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వం పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments