విక్రమ్ తో ప్రయత్నాలు చేస్తున్నాడు....
- IndiaGlitz, [Thursday,November 10 2016]
విలక్షణ నటుడుగా ఈ తరం హీరోల్లో ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు. రీసెంట్‌గా ఇంకొక్కడు సినిమాతో వంద కోట్ల హీరోగా మారిన విక్రమ్ ఇప్పుడు వెంటనే ఏ సినిమాలో నటించడం లేదు. హాలీవుడ్ మూవీ డోంట్ బ్రీత్ సినిమాలో నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. పలువురు దర్శకులు విక్రమ్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు వారిలో గౌతమ్‌మీనన్ ఒకరు. సాహసం శ్వాసగా సాగిపో(తమిళంలో అచ్చం ఎన్బదు మనమయడా)సినిమాతో బిజీగా ఉన్న గౌతమ్‌మీనన్‌కు సినిమా విడుదలవుతుండటంతో నెక్ట్స్ మూవీని విక్రమ్‌తో చేయాలనుకుంటున్నాడట. రీసెంట్‌గా విక్రమ్‌ను కూడా కలిశాడట కూడా. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విక్రమ్, గౌతమ్‌మీనన్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందట.