Pawan Kalyan:ఒక్కసారి జనసేనను నమ్మండి.. ప్రజలకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన మైనారిటీ నాయకుడు సాధిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్ ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని.. దిక్కు లేకుండా పోయిందని వాపోయారు. గత తొమ్మిదేళ్లుగా జనసేన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చిందని.. వైసీపీ లాంటి గూండా నాయకులను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నామని తెలిపారు. అందుకు యువత తనకు అండగా నిలవడమే కారణమన్నారు.
బీజేపీతో కలిసి ఉండటం వల్ల రాలేకపోతున్నట్టు కొందరు ముస్లింలు చెబుతున్నారని.. మత వివక్ష చూపించనని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. ముస్లింలను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడనని. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతానని హామీ ఇచ్చారు. కులం, మతాన్ని దాటి వచ్చా.. మానవత్వాన్ని నమ్మానని చెప్పారు. ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు గనులు తవ్వుకుని వెళ్లిపోతున్నారు తప్ప జిల్లా అభివృద్ధికి నాయకులు కృషి చేయడం లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్న సీఎం జగన్ విమర్శలపై జనసేన తీవ్రంగా స్పందించింది. "సెల్ఫ్ గోల్ వేసుకోడంలో నిన్ను మించినోడు లేడు కదా సీబీఐ దత్తపుత్రా జగన్. 2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా? ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ, తెలంగాణలో పోటీ చేసే దమ్ము నీకు నీ పార్టీకి లేదు అని నువ్వే చెప్పుకుంటున్నట్టుంది" అని కౌంటర్ ఎటాక్ చేస్తూ ట్వీట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments