ట్రంప్ ‘పసుపు టై’.. మెలానియా ‘వస్త్రం’ స్పెషాలిటీ ఇదీ..
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాకు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ట్రంప్ కట్టుకున్న ‘పసుపు టై’, మెలానియా ట్రంప్ నడుముకు కట్టుకున్న ‘వస్త్రం’ గురించి ఇప్పుడు అంతా చర్చనీయాంశమైంది. అమెరికాలో ఉన్నప్పుడు ఎప్పుడూ బ్లూ, రెడ్ టైలు ధరించే ట్రంప్.. భారత్ పర్యటర నిమిత్తం ‘పసుపు టై’ ధరించారు. అయితే ఆ పసుపు టై వెనుక పెద్ద కథే ఉందట.
పసుపు టై కథ ఇదీ..!
పసుపు టై కట్టుకోవడంలో గొప్ప సందేశం దాగి ఉందట. ఎల్లో కలర్.. ఆనందానికి, వెచ్చదనానికి, ప్రకాశవంతానికి ప్రతీకగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. మరీ ముఖ్యంగా హిందూయిజానికి వచ్చేసరికి ఈ రంగుకు చాలా ప్రాముఖ్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. నాలెడ్జ్‌కు ప్రతీకగా ఈ రంగును వర్ణిస్తుంటారు. స్నేహం చిగురించాలన్న (వసంతం) దానికీ సంకేతంగా ట్రంప్ యెల్లో రంగు టైని కట్టుకున్నారని తెలుస్తోంది. అంటే భారత్-అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని ఈ టై కట్టుకున్నారన్న మాట.
మెలానియా వస్త్రం వెనుక..!
వైట్ డ్రెస్‌లో మెరిసిన మెలానియా ట్రంప్.. నడుముకు ఓ వస్త్రాన్ని కట్టుకున్నారు. ఆకుపచ్చ, బంగారపు రంగుతో ఉన్న ఈ వస్త్రం వెనుక కూడా పెద్ద కథే ఉందట. 20వ శతాబ్దానికి చెందిన ఇండియన్ టెక్స్‌టైల్స్‌తో తయారుచేసినట్టు హెర్వ్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. అయితే.. ప్యారిస్‌లోని తన స్నేహితుల ద్వారా ఈ టెక్స్‌టైల్‌ను సేకరించినట్టు తెలిపారు. ఈ వస్త్రంలోని బోర్డర్ పీస్ చాలా అరుదైన క్లాత్ అని ఆయన వివరించారు. కాగా.. మెలానియా ట్రంప్ మోడల్ కావడంతో విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఏ దుస్తులు వేసుకోవాలన్నది మెలానియానే సొంతంగా ఎంచుకుంటారట.
వాహ్ తాజ్..!
అహ్మదాబాద్ పర్యటన ముగించుకున్న ట్రంప్ దంపతులు నేరుగా ఆగ్రా చేరుకున్నారు. ఈ సందర్భంగా భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్, ఉన్నతాధికారులతో కలిసి తాజ్ మహల్ సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులు తాజ్ పరిసర ప్రాంతాల్లో గైడ్ సహకారంతో కట్టడం విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు వారంతా పోజులిచ్చారు. తాజ్ అందాలకు ట్రంప్ దంపతులు ముగ్ధులయ్యారు. అనంతరం తాజ్ సందర్శనపై తమ అనుభవాలను రికార్డ్ బుక్‌లో ట్రంప్ దంపతులు రాశారు. ట్రంప్ సందర్శన దృష్ట్యా సందర్శకులకు అనుమతి నిరాకరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com