ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్..

వైట్ హౌస్‌లో కరోనా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన సలహాదారుణికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు వెంటనే కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారిణి హోప్ హిక్స్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే ట్రంప్ దంపతులు తాజాగా కరోనా పరీక్ష చేయించుకున్నారు.

పరీక్షల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ట్రంప్ సలహాదారిణిగా పనిచేస్తున్న హూప్ హిక్సు ట్రంప్‌తో కలిసి ఈ వారంలో ప్రెసిడెన్షియల్ హెలికాప్టర్ మెరైన్‌వన్, ఎయిర్‌ఫోర్స్ వన్ మిన్నెసోటాలో ప్రయాణించారు. దీంతో పాటుగా ర్యాలీలో సైతం ట్రంప్‌తో పాటు హిక్స్ పాల్గొన్నారు. నవంబర్‌లో యూఎస్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా నిర్ధారణ కావడమనేది ట్రంప్ చాలా పెద్ద దెబ్బగా పరిణమించే అవకాశం ఉంది.

కోవిడ్ పరీక్ష ఫలితానికి ముందు ట్రంప్ ట్విట్టర్ వేదికగా తమ దంపతులిద్దరం కరోనా పరీక్ష చేయించుకున్నామని ఫలితం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. హిక్స్‌కు పాజిటివ్ అని తెలియగానే తమ దంపతులిద్దరూ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. ‘‘చిన్న విరామం కూడా తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్న హోప్ హిక్సుకు కొవిడ్- 19 పాజిటివ్ అని తేలింది. నేను, నా భార్య మెలానియా కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే మేము క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

More News

'బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్' చిత్రం టీజ‌ర్ విడుద‌ల

యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ శ్రీకృష్ణ‌(నందు), డ‌స్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ కలయికలో తెరకెక్కిన‌ చిత్రం "బొమ్మ బ్లాక్ బస్టర్‌.

పంజాగుట్ట పీఎస్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్ ఫిర్యాదు..

సినీ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొట్టారంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

అనుకున్నదొక్కటి.. అయినది ఒకటి.. మెహబూబ్ ప్లాన్ రివర్స్..

తానేదో తలిస్తే దైవమేదో తలిచినట్టు అయింది మెహబూబ్ పని. కెప్టెన్ అవ్వాలనుకుని నైట్ అంతా నిద్ర లేకుండా కాయిన్స్‌ని పోగేసుకున్నాడు.

డబ్బులు ఎవరికీ ఊరికే రావంటూ.. ఏకంగా పాటే పాడేశారు...

డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. అనగానే మనకు ఓ వ్యక్తి గుర్తొస్తారు కదా.. నున్నటి గుండుతో ఆయన తన మాటలతోనే తెగ పాపులర్ అయిపోయారు.

టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా.. ఏపీ రాజకీయాల్లో కలకలం

టీడీపీ పొలిట్ బ్యూరోకి గల్లా అరుణ రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది.