భారతీయ పురుషులకు ట్రంప్ వార్నింగ్!

భారత్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికర అనడం హెచ్చరిక అనడం ఇంకా బెటరేమో. అహ్మదాబాద్ మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్‌తో తమ బంధం మరింత బలోపేతం అవుతోందన్నారు. అనంతరం ఉగ్రవాదం, అన్వాయుధాల గురించి మాట్లాడిన ట్రంప్.. ఈ సందర్భంగా భారతీయ పురుషులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు!. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వార్నింగ్ ఇచ్చారు.

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు..!?
దక్షిణాసియాలో భారత్ అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తోందన్నారు. వాణిజ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగిందని.. ఎగుమతులు, దిగుమతులు వృద్ధి పథంలో ఉన్నాయన్నారు. అంతేకాదు.. భారత ప్రధాని వేగవంతమైన సంస్కరణలతో వ్యాపార వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారని మోదీని ఆయన ఆకాశానికెత్తేశారు.

ఇదీ వార్నింగ్!
‘దేశ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పారిశ్రామికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకొస్తున్నారు. గొప్ప ప్రగతిని సాధిస్తున్నారు. పురుషులూ జాగ్రత్తగా ఉండాలి’ అంటూ తనదైన శైలిలో ఒకింత వార్నింగ్ ఇస్తూ.. ఒకింత వ్యంగ్యంగా ఆయన మాట్లాడారు. ‘ఆకాశంలో సగం ఆడది’ అంటారు కదా.. ప్రస్తుతం ట్రంప్ మాటలను బట్టి చూస్తే సగం కాదు ఎప్పుడో పూర్తయ్యిందని.. ఇక పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారన్న మాట.

More News

ధోనీ అభిమానులను హర్ట్ చేసిన ట్రంప్ మాటలు!

సబర్మతీ ఆశ్రమం సందర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మెలానియా గుజరాత్‌లోని మెతెరా స్టేడియం చేరుకున్నారు.

భారత్ పర్యటనలో ట్రంప్ అనుకున్నట్లే జరిగిందిగా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో కాలుమోపిన సంగతి తెలిసిందే.

ట్రంప్ సంతకం చూసి షాక్.. సెటైర్లే.. సెటైర్లు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

మోదీకి ఫుట్‌బాల్.. ట్రంప్‌కు క్రికెట్!

టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్ అయ్యారు కదూ..! అవును.. మీరు వింటున్నది నిజమేనండోయ్..

భూ ప్రపంచం మీదే ‘మోదీ’ గొప్పనేత : ట్రంప్

గుజరాత్‌లోని మెతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు.