భారత్‌కు.. ఇండియన్స్‌కు కృతజ్ఞతలు..: ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇవ్వగా.. ఆ తర్వాత భారత్ పెద్ద మనసు చేసుకుని ఎట్టకేలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతికి అంగీకరించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు ప్రస్తుత పరిస్థితికి అవసరమైన అన్ని ఔషధాల్ని సైతం భారత్ ఎగుమతి చేయబోతోంది. దీనికి ట్రంప్ ట్వి్ట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
ధన్యవాదాలు..
అసాధరణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ట్విట్టర్‌లో ట్రంప్ రాసుకొచ్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఈ మేలు మర్చిపోలేమన్నారు. భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వం.. ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు, మోదీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై మంచి నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కి, భారత ప్రజలకు ఈ సందర్భంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ రిప్లయ్..
ట్రంప్ ట్వీట్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా రిప్లయ్ ఇచ్చారు. ‘ట్రంప్.. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితులు స్నేహితులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. కొవిడ్-19పై చేస్తోన్న పోరాటంలో భారత్ వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటుంది. మనమంతా కలిసి కరోనాపై గెలుస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments