భారత్‌కు.. ఇండియన్స్‌కు కృతజ్ఞతలు..: ట్రంప్

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఝలక్ ఇవ్వగా.. ఆ తర్వాత భారత్ పెద్ద మనసు చేసుకుని ఎట్టకేలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతికి అంగీకరించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు ప్రస్తుత పరిస్థితికి అవసరమైన అన్ని ఔషధాల్ని సైతం భారత్ ఎగుమతి చేయబోతోంది. దీనికి ట్రంప్ ట్వి్ట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

ధన్యవాదాలు..

అసాధరణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ట్విట్టర్‌లో ట్రంప్ రాసుకొచ్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పిన ఆయన.. ఈ మేలు మర్చిపోలేమన్నారు. భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వం.. ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు, మోదీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై మంచి నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కి, భారత ప్రజలకు ఈ సందర్భంగా ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.

మోదీ రిప్లయ్..

ట్రంప్ ట్వీట్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా రిప్లయ్ ఇచ్చారు. ‘ట్రంప్.. మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితులు స్నేహితులను మరింత దగ్గర చేస్తాయి. భారత్‌-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. కొవిడ్‌-19పై చేస్తోన్న పోరాటంలో భారత్‌ వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటుంది. మనమంతా కలిసి కరోనాపై గెలుస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు.

More News

మ‌రోసారి పెద్ద‌నాన్న సినిమాలో...?

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు త‌న‌య నిహారిక కొన్ని వెబ్ సిరీస్‌ల్లో న‌టించిన త‌ర్వాత హీరో్యిన్‌గా కూడా కొన్ని సినిమాలు చేసింది.

బ‌న్నీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ గుర్రు..!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే అయినా ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రి మ‌ధ్య చెడింది. నేను చెప్ప‌ను బ‌ద్ర‌ర్ అంటూ

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై కోపంగా ఉన్న నాగ్ ?

డైరెక్ట‌ర్ ప‌రుశురామ్‌పై టాలీవుడ్ అగ క‌థానాయ‌కుల్లో ఒకరైన నాగార్జున కోపంగా ఉన్నారా? అంటే కొంద‌రు మాత్రం అవున‌నే అంటున్నారు. అందుకు కార‌ణం ప‌రుశురామ్ చేసిన ప‌నేన‌ని వారు జ‌వాబిస్తున్నారు.

నాలుగు నెల‌ల ముందే చెప్పిన బ‌న్నీ...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

కరోనాతో చనిపోతే.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.