ఇండియాతో పాటు ఏడు దేశాలకు ‘ట్రంప్’ షాక్!

  • IndiaGlitz, [Tuesday,April 23 2019]

ఇండియాతో పాటు పలు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. సోమవారం ట్రంప్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో దేశాల అధిపతులు, ప్రధానులు కంగుతిన్నారు. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్‌ సహా ఏ దేశానికీ మినహాయింపు ఇవ్వబోమని.. పూర్తిగా రద్దు చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భగ్గుమంది. దీంతో ఒక్క రోజే బ్రెంట్‌ రకం పీపా ముడి చమురు ధర 3.3 శాతం పెరిగి 74.15 డాలర్ల ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.

అసలేంటి ఈ కథ..!?

అంటే.. ఇంతవరకు కొన్ని దేశాలకు ‘విశేష తగ్గుదల మినహాయింపు’ విధానం కింద అక్కడ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన అమెరికా ఇకపై ఆ విధానం ఉండబోదని ఎలాంటి మొహమాటం లేకుండా తేల్చిచెప్పింది. ఇకపై ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలి. లేకపోతే ఈ దేశాలపైనా అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ భారత్‌తో పాటు మరో ఏడు దేశాలపై పడనుంది.

ప్రత్యామ్నాయం దొరికినట్లే..!

ఇదిలా ఉంటే.. అమెరికా ఆంక్షలతో మున్ముంథు ఏం చేయాలి..? చమురు సంగతేంటి..? అని భారత్‌తో పాటు మిగతా ఏడు దేశాలు ఆలోచనలో పడ్డాయి. చమురు ఎగుమతి చేసుకునే దేశాల్లో ఇరాక్‌, సౌదీ అరేబియా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్‌ మూడో స్థానంలో ఉంది. కాగా కొనుగోలులో చైనా ఫస్ట్, భారత్ సెకండ్ స్థానంలో ఉన్నాయి. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నమని త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతామని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మెక్సికో, సౌదీ అరేబియా, కువైట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి అదనపు చమురు దిగుమతి చేసుకుంటామన్నారు.