వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నాలుగు రోజులుగా కరోనాకు వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో ట్రంప్ చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన డిశ్చార్జ్‌పై జాతీయ మీడియా విభిన్న కథనాలను వెలువరిస్తోంది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోక ముందే.. వైద్యులు చెప్పినప్పటికీ ట్రంప్ వినిపించుకోకుండా డిశ్చార్జ్ అయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. ఆయన పూర్తిగా కోలుకున్నారా? లేదా? అనే విషయం ఒక వారం గడిస్తే కానీ తెలియదని వైద్యులు పేర్కొన్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది.
అయితే వైట్ హౌస్ వైద్యుడు మాత్రం జాతీయ మీడియా చెప్పిన దానికి విరుద్ధమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గడిచిన 72 గంటల్లో ట్రంప్‌కు జ్వరం రాలేదని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేందుకు అవసరమైనంతగా ట్రంప్ కోలుకున్నారని వెల్లడించారు. సోమవారం మరోసారి ఆయనకు రెమిడెసివీర్ అందించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అయినప్పటికీ పూర్తిగా కోలుకున్నారని చెప్పలేమని.. అత్యుత్తమ వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రంప్‌కు నిరంతరం చికిత్స కొనసాగుతుందని సియాన్ కాన్లే వెల్లడించారు.
ఆసుపత్రి నుంచి ట్రంప్ నేరుగా శ్వేతసౌధానికి చేరుకున్నారు. కాగా.. ట్రంప్ ఆరోగ్యంగానే కనిపించారు. సౌత్ పోర్టికో మెట్ల ద్వారా పైకి చేరుకుని విలేకరులకు అభివాదం చేశారు. శ్వేతసౌధంలోకి వెళ్లగానే ఆయన తన మాస్కును తొలగించి పోర్టికోలో నిలబడి తాను వచ్చిన హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు సైనిక వందనం చేశారు. ఆ తరువాత తనకు మద్దతిస్తున్న వారందరికీ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్‌కు ఎవరూ భయపడవద్దని సూచించారు. త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com