టిక్‌టాక్‌పై కొరడా ఝుళిపించిన ట్రంప్..
Send us your feedback to audioarticles@vaarta.com
చైనా యాప్‌లపై అమెరికా సైతం కొరడా ఝుళిపించింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్‌తో లావాదేవీలను నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ ఆదేశించారు. అంతేకాదు.. దీనిలో పలు విషయాలను పొందు పరిచారు. టిక్‌టాక్, వుయ్ చాట్ వంటి చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈ నిషేధం రానున్న 45 రోజుల్లో అమల్లోకి రానుంది.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. టిక్‌టాక్ యూజర్ల సమాచారంతో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్ సమాచారాన్ని, నెట్వర్క్ కార్యకలాపాలు, బ్రౌజింగ్, సెర్చ్ హిస్టరీలను ఆటోమేటిక్‌గా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తెలుసుకుంటోందని.. దీని వలన తమ దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ముప్పు వాటిల్లే ప్రమాదముందని అమెరికా అభిప్రాయపడింది. ఇప్పటికే టిక్‌టాక్‌ను ఇండియాలో నిషేధించడంతో ఆ సంస్థ యాజమాన్యానికి భారీ దెబ్బే తగిలింది. ఇప్పుడు అమెరికా కూడా నిషేధించడంతో టిక్‌టాక్ మరింత కష్టాల్లో కూరుకుపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments