మేం అడిగితే ఇవ్వరా.. భారత్‌పై ప్రతీకారం ఉండొచ్చు: ట్రంప్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్‌పై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాస్త వర్కవుట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇండియాలో మెండుగా ఉంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి.. ‘మీ దగ్గర పెద్దఎత్తున ఉత్పత్తి అవుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను మేం దిగుమతి చేసుకుంటాం ఇవ్వండి’ అని కోరగా ట్రంప్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు ట్రంప్ స్పందించారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. అమెరికాతో భారత్ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందన్నారు. ‘క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై భారత్ నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం కానీ దానికి ప్రతీకారం ఉండొచ్చు..ఎందుకు ఉండకూడదు?’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.
నిషేధం ఎత్తివేత..
అయితే ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి డిమాండ్ పెరిగిందని.. ఈ ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి వచ్చింది. దీనిపై విదేశాంగ స్పందిస్తూ.. మానవతా దృక్పథంతో క్లోరోక్విన్ సహా అవసరమైన ఇతర ఔషధాల్ని ఆయా దేశాలకు సరఫరా చేస్తామని విదేశాంగశాఖ ప్రకటించింది. పొరుగుదేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అవసరమైన మొత్తానికి లైసెన్స్ ఇవ్వాలని.. భారత్‌పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో ఆపాలని విదేశాంగ శాఖ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments