డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు అలుపెరగని పోరాటం చేస్తున్న విషయం విదితమే. అలా మరణాన్ని సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌పై పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న తీరు బ్యూటిఫుల్‌గా ఉందన్న ట్రంప్ వ్యాఖ్యానించారు. అంటే.. పోరాటం అనేది ఆయనకు చాలా అందంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారన్న మాట.
అసలేం జరిగింది..!?
ఇటీవల ఓ మీడియా మీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. కోవిడ్ 19పై జరుగుతున్న పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర ప్రస్తావించారు. ‘మృత్యువుకు భయపడకుండా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. బుల్లెట్లకు సైనికులు ఎదురేగినట్టు డాక్టర్లు, నర్సులు పనిచేస్తున్నారు. ఇది అందమైన విషయం’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్ మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారమే చెలరేగింది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రముఖలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు. చావు అంత అందమైనదా.. అయితే మీరే చచ్చిపోండి అంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కరోనా లెక్కలివీ..
ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 4,543,059 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ 303,707 మరణించారు. 1,712,890 మంది కరోనాను జయించారు. అమెరికా విషయానికొస్తే 1,457,593 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 303,707 మంది కన్నుమూశారు. 1,712,890 మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 2,526,462 యాక్టివ్ కేసులుండా.. 45,521 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉందని www.worldometers.info ప్రకారం తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments