తనని బ్యాన్ చేసిన ట్విట్టర్ కి పోటీగా 'గెట్టెర్'.. ట్రంపా మజాకా!
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ ఎంత హంగామా చేశాడో అందరికి తెలిసిందే. అధ్యక్షుడిగా కంటే తన విలక్షణమైన ప్రవర్తనతో ట్రంప్ ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యాడు. హింసని ప్రేరేపిస్తున్నాడనే కారణాలతో ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు ట్రంప్ ఖాతాలని నిరవధికంగా బ్యాన్ చేశాయి.
దీనితో తాను సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేసుకుంటానని ట్రంప్ గతంలో చెప్పాడు. ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు అన్నంత పని చేశాడు. ట్విట్టర్ కు పోటీగా గెట్టెర్(GETTR) ప్రారంభించాడు. ఇతర సోషల్ మీడియా వేదికల్లా కాకుండా ఇందులో పూర్తిగా భావప్రకటనకు స్వేచ్ఛ ఉంటుందట.
ఇదీ చదవండి: హోప్ ఇస్తున్న జె అండ్ జె కోవిడ్ వ్యాక్సిన్.. కేవలం సింగిల్ డోస్ లోనే..
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చెందారు. అమెరికా 46 వ ప్రెసిడెంట్ గా బైడెన్ విజయం సాధించారు. ఓటమి అసహనంతో ట్రంప్ తన అనుచరులని, అభిమానులని రెచ్చగొట్టేలా, హింసని ప్రేరేపించేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టాడు. క్యాపిటల్ భవనంపై దాడిని ప్రేరేపించేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు ట్రంప్ పై బ్యాన్ విధించాయి.
దీనితో సొంతంగా శోకాలు మీడియా ఫ్లాట్ ఫామ్ ప్రారంభించాలని ట్రంప్ భావించారు. అనుకున్నట్లుగానే గురువారం గెట్టెర్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ట్రంప్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గెట్టెర్ ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout