ఫుట్‌పాత్‌పై నిద్రపోతున్న వారిపై దూసుకెళ్లిన ట్రక్కు...15 మంది మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
అవి అసలే ఫుట్‌పాత్ జీవితాలు.. వీలైతే కలో గంజి.. లేదంటే కుళాయి నీళ్లు తాగి బతుకు బండి లాగిస్తుంటారు. ఇక నిలువ నీడ ఉండదు.. ఇంతటి ఘోరమైన చలిలోనూ ఫుట్‌పాత్‌లే గతి.. అలాంటి జీవితాలపైకి మృత్యువు ట్రక్కు రూపంలో దూసుకొచ్చింది. నిద్రపోతున్న వారిని శాశ్వత నిద్రలోకి పంపేసింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగర సమీపంలో జరిగింది.
సూరత్ నగర సమీపంలోని కోసంబి పట్టణంలో ఫుట్ పాత్‌పై 18 మంది నిద్రిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన ట్రాక్టర్ మరో ట్రక్కును ఢీకొట్టడంతో డ్రైవరు నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్రక్ ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సూరత్‌లోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజస్థాన్‌లోని బాన్సువాడ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. రాళ్లు కొట్టుకుని జీవనం సాగిస్తారని తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది నెలల పసికందు సురక్షితంగా బయటపడగా.. చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలు కోల్పోవడం మరింత దయనీయంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout