దుబ్బాక ఎఫెక్ట్ : గ్రేటర్‌ ఎన్నికల కోసం టీఆర్ఎస్ వ్యూహం..

  • IndiaGlitz, [Thursday,November 12 2020]

దుబ్బాక ఎఫెక్ట్ గ్రేటర్ ఎన్నికల ఫలితం పునరావృతం కాకుండా టీఆర్ఎస్ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. డిసెంబర్ మొదటి వారంలోనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు నిర్వహిస్తోంది. కాగా.. ఈ ఎన్నికలను సంక్రాంతి తర్వాతే జరిగే అవకాశముంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ అలెర్టైంది. దుబ్బాకలో బీజేపీ గెలుపు ప్రభావం గ్రేటర్ ఎన్నికల మీద పడకుండా చూసుకునేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలు బీజేపీలోకి చేరకుండా కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఎన్నికల నిర్వహణపై 11 పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. దీపావళి అనంతరం ఏ క్షణమైనా గ్రేటర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో నేడు సీఎం కేసిఆర్ ప్రగతి భవన్‌లో భేటి కానున్నారు. గ్రేటర్ సహా వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్యీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎక్కడా కూడా పట్టు కోల్పోకుండా ఉండేదుకు పార్టీ నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నిక బాధ్యతను ఇప్పటికే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించేశారు. ఈ క్రమంలోనే గ్రేటర్ అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను దాదాపుగా కేటీఆర్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రోజుకు ఐదుగురు చొప్పున సిటీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఎన్నికలపై రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరదసాయన్ని గ్రేటర్ ఓటర్లు మరచిపోకముందే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. బీజేపీని గ్రేటర్ ఎన్నికల్లో అడ్డుకోగలిగితే తిరిగి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి ముప్పూ ఉండబోదనేది టీఆర్ఎస్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

More News

ఎన్నారై భర్త దాష్టీకం.. భార్యపై చెప్పులతో దాడి..

ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఎన్నారై సంబంధాలంటేనే ఆడపిల్లల తల్లిదండ్రులను భయపడేలా చేస్తున్నాయి.

ఎంత ఫాస్ట్‌గా స్కూళ్లను తెరిచారో.. అంతే ఫాస్ట్‌గా మూసేశారు..!

ముందూ వెనుక ఆలోచన లేకుండా గవర్నమెంట్ చేసిన పనికి ప్రస్తుతం అటు ఉపాధ్యాయులు.. ఇటు విద్యార్థులు..

క‌ళ్యాణ్ దేవ్ కొత్త చిత్రం ప్రారంభం

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. న్యూయార్క్‌ గవర్నర్ కీలక నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మరోమారు తిరిగి విజృంభిస్తోంది.

ప్రి వెడ్డింగ్ షూట్‌‌లో విషాదం.. వధూవరులిద్దరూ మృతి

ఐదేళ్ల ప్రేమకు పెద్దలు కూడా రైట్ కొట్టారు. దీంతో ఆ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఇరువైపుల పెద్దలూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు.