ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 12 స్థానాలకు గానూ ఇప్పటికే 6 చోట్ల ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్ మిగిలిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించింది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఆరు స్థానాల్లోనూ కారు పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఎల్.రమణ, భానుప్రసాద్ గెలిచారు. భానుప్రసాద్‌కు 584, రమణకు 479 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్‌లో దండె విఠల్ 667 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలిచారు. ఇక్కడ అధికార పార్టీకి 480, కాంగ్రెస్‌కు 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పోలయ్యాయి. 12 ఓట్లను చెల్లనివిగా గుర్తించారు అధికారులు. నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థికి 917, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన నగేశ్‌కు 226, లక్ష్మయ్యకు 26, వెంటేశ్వర్లుకు 6, రామ్‌సింగ్‌కు 5ఓట్లు రాగా... 50 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. అటు మెదక్‌లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కారు పార్టీకి 762, కాంగ్రెస్‌కు 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు పోలవ్వగా.. 12 చెల్లని ఓట్లుగా అధికారులు ప్రకటించారు.
ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలు వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments