MP Santhosh Kumar : పేట్ల బుర్జ్ ఆసుపత్రి రూ. కోటి నిధులు.. ఎంపీ సంతోష్ కుమార్‌పై హరీశ్ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తన పెద్ద మనసు చాటుకున్నారు. తాను పుట్టిన పేట్ల బుర్జ్ ఆసుపత్రికి రూ.కోటి నిధులను మంజూరు చేశారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించారు. దీనిపై రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ.. సంతోష్‌ను అభినందించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... మాతృభూమిని, మాతృభాషను మరచిపోకూడదు అనే సామెత వుందని దానిని అనుసరిస్తూ ఎంపీ సంతోష్ కుమార్ పేట్ల బుర్జ్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశారని ప్రశంసించారు. సంతోష్ తాను జన్మించిన ఆసుపత్రిని గుర్తుంచుకుని దాని అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని హరీశ్ పేర్కొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కండి : హరీశ్ రావు
సంతోష్ కుమార్ నిర్ణయం ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తుందని, తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి దోహదపడుతుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఆయన అందించిన నిధులతో పేట్ల బుర్జు ప్రభుత్వాసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పుట్టినవారు సంతోష్‌ను స్పూర్తిగా తీసుకుని ఆయా ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హరీశ్ పిలుపునిచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో చరిత్ర వున్న పేట్ల బుర్జ్ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆ నిధులను ఉపయోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హరీశ్ రావు ఆదేశించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్తగా సంతోష్‌కు గుర్తింపు:
ఇకపోతే... గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇప్పటికే ఎంతోమందితో మొక్కలు నాటిస్తుననారు. సెలబ్రెటీలు కూడా ఈ మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంతోష్ కుమార్ చేస్తున్న కృషిపై దేశవ్యాప్తంగా పలువురి ప్రశంసలు దక్కుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments