టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సింహయ్య మృతి చెందారు. నోములకు భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు ఝాన్సీ రాణి, అరుణ జ్యోతి వివాహితులు ఆస్ట్రేలియాలో స్థిరపడగా కుమారుడు నోముల భగత్ కుమార్ హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు.
నోముల నర్సింహయ్య నకిరేకల్ మండలం పాలెంలో 1956 జనవరి 9న జన్మించారు. సాధారణ రైతు కుటుంబమైన రాములు మంగమ్మ దంపతుల ఐదుగురి సంతానంలో నోముల నర్సింహ్మయ్య రెండవ సంతానం. ఉస్మానియా యూనివర్శిటీలో లా చదివే సమయంలోనే ఎస్ఎఫ్ఐలో నోముల నర్సింహయ్య పని చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో 1981లో ఎల్ఎల్బీ, 1983లో ఎంఏ పూర్తి చేశారు. నల్లగొండ, నకిరేకల్ కోర్టుల్లో మంచి న్యాయవాదిగా గుర్తింపు పొందారు. సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నోముల1987, 1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్ ఎంపీపీగా పని చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించింది. సీపీఎం శాసనసభా పక్ష నేతగా పనిచేసిన నోముల 2009లో రిజర్వేషన్ మారడంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి హుజూర్ నగర్ సీటు కోసం ప్రయత్నించారు. సీపీఎం నుంచి టికెట్ రాకపోవడంతో 2014లో టీఆర్ఎస్లో చేరి నాగార్జునసాగర్ టికెట్ సాధించి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి జానారెడ్డి విజయయాత్రకు నోముల చెక్ పెట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout