బాల‌య్య 106కు కొత్త చిక్కులు..?

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌రించారు. స్క్రిప్ట్ ప్ర‌కారం సినిమాను ప‌లు లోకేష‌న్స్‌లో చిత్రీక‌రించాల్సి ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు ఈ సినిమాలో బాల‌య్య డ్యూయెల్ రోల్ చేస్తాడ‌ని టాక్ ఉంది. అందులో ఒక‌టి అఘోరా పాత్ర‌ట‌. అందుకోసం కొన్ని స‌న్నివేశాల‌ను వార‌ణాసిలో చిత్రీక‌రించాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే షూటింగ్స్‌కు అప్పుడప్పుడే ప‌రిష్మ‌న్స్ దొరికేలా లేవు.

వార‌ణాసి అనే కాదు.. ఇత‌ర లొకేష‌న్స్‌లో షూటింగ్‌ల‌కు అనుమ‌తులు దొర‌క‌డం అనేది అనుమానంగానే మారింది. దీంతో బోయ‌పాటి శ్రీను సినిమా స్క్రిప్ట్‌ను మారుస్తున్నాడ‌ట‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్ విన‌ప‌డుతోంది. ఈ చిత్రంలో భూమిక లేడీ విల‌న్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

సరదా కోసం బయటికి రావడం మూర్ఖత్వం: కీరవాణి

లాక్‌డౌన్ సమయంలో సరదా కోసం కొందరు బయటికొస్తున్నారని.. నిజంగా అలా రావడం మూర్ఖత్వం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి వ్యాఖ్యానించారు.

తార‌క్ ట్వీట్‌కు వెంకీ ఫన్నీ రీ ట్వీట్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ అవుతోన్న ఛాలెంజ్ ‘బీ ద రియ‌ల్ మేన్‌’. క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లోని మ‌హిళ‌ల‌కు చేదోడు వాదోడుగా ఉండాల‌ని సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్‌లో ముందు

నిరూపిస్తే రాజధాని సెంటర్‌లో ఉరేసుకుంటా: వైసీపీ ఎమ్మెల్యే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ తరుణంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి.

చిల్లర రాజకీయాలకు ఆపి.. క్షమాపణ చెప్పండి : పవన్

రోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం రూ.2 లక్షలు

ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు.