'త్రివిక్రమన్' ప్రచార చిత్రం విడుదల!!

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

"త్రివిక్రమపాండ్యన్" అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన ఒక బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా రూపొందిన చిత్రం "త్రివిక్రమన్". అమీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మించిన ఈ చిత్రానికి తోటకూర రామకృష్ణారావు సహ నిర్మాత. కస్తూరి శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. లేడి మ్యూజిక్ డైరెక్టర్ రుంకీ గోస్వామి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలె రీ రికార్డింగ్ అందించారు. డిస్కో శాంతి సోదరి సుచిత్ర ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రవిబాబు, నాగబాబు, "ఈరోజుల్లో" ఫేమ్ శ్రీ, ధన్ రాజ్, ప్రవీణ్ రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ముఖ్య తారాగణంగా.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణరాజు "త్రివిక్రమన్" ట్రైలర్ రిలీజ్ చేశారు. విశిష్ట అతిధిగా హాజరైన శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతుపల్లి శ్రీనివాసరావు"త్రివిక్రమన్" టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చినబాబు, విశ్వ తదితరులతోపాటు "త్రివిక్రమన్" యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వినూత్నమైన కథ-కథనాలతో.. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన "త్రివిక్రమన్" టైటిల్ లోగో, మరియు ట్రైలర్ చాలా బాగున్నాయని, సినిమా ఘన విజయం సాధించి, దర్శకనిర్మాత క్రాంతికుమార్ ఉజ్వలమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని వక్తలు ఆకాంక్షించారు. ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ ధియేటర్స్ లో విడుదలయ్యేందుకు తన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

దర్శకనిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ.. "సహ నిర్మాత తోటకూర రామకృష్ణారావు, తన మిత్రుడు ప్రవీణ్ రెడ్డి, ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన కస్తూరి శ్రీనివాస్ ల సహాయ సహకారాల వల్లే.. సినిమా తీయాలనే తన కల సాకారమయ్యిందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, చినబాబుల ప్రోత్సాహాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని" అన్నారు. కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు ప్రేక్షకులు "త్రివిక్రమన్" చిత్రానికి తప్పకుండా మంచి విజయం అందిస్తారనే నమ్మకం తనకుందని ఆయన పేర్కొన్నారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిధుల చేతుల మీదుగా యూనిట్ సభ్యులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు.

More News

'మజ్ను' ఆడియో రిలీజ్ డేట్....

భలే భలే మగాడివోయ్,జెంటిల్ మన్ వంటి వరుస సక్సెస్ లు సాధించిన నేచురల్ స్టార్ నాని

42 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్య..!

నందమూరి నట సింహం బాలయ్య 42ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..?నటరత్న నందమూరి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం తాతమ్మకల.

విశాల్ అప్పుడే డబ్బింగ్ మొదలేట్టేశాడు....

విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణ లో హరి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ పై సురాజ్ దర్శకత్వంలో జి.హరి నిర్మిస్తున్న చిత్రం

పవన్ సినిమా టైటిల్....?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తదుపరి చిత్రానికి రంగం సిద్ధమవుతుంది.

అదే డైరెక్టర్ తో మరోసారి రజనీకాంత్....

సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ మూవీ 'కబాలి'.కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.