త్రివిక్రమ్ బ్రేక్ వేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా యువ కథానాయకుడు నితిన్‌కి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు వీలైనంతవరకు తన సినిమాల్లో పవన్ నామస్మరణ బాగానే చేస్తుంటాడు నితిన్. అయితే.. పవన్‌కి సంబంధించిన ఓ అంశం మాత్రం నితిన్‌కి అస్సలు కలిసి రావడం లేదు. అదేమిటంటే.. పవన్‌తో పనిచేసిన డైరెక్టర్లతో నితిన్ కూడా పని చేస్తే పాజిటివ్ రిజల్ట్ మాత్రం రాలేదు. పూరీ జగన్నాధ్, కరుణాకరన్ విషయంలో..గతేడాది రిలీజైన హార్ట్ ఎటాక్, చిన్నదానా నీకోసం సినిమాలతో ఈ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న నితిన్.. ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ విషయంలోనూ 'అ..ఆ..' సినిమా ద్వారా దాన్ని కంటిన్యూ చేస్తాడా? లేదంటే త్రివిక్రమ్ నే ఈ అంశానికి బ్రేక్ వేస్తాడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com