త్రివిక్రమ్ బ్రేక్ వేస్తాడా?

  • IndiaGlitz, [Monday,October 19 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమానిగా యువ క‌థానాయ‌కుడు నితిన్‌కి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు వీలైనంత‌వ‌ర‌కు త‌న సినిమాల్లో ప‌వ‌న్ నామ‌స్మ‌ర‌ణ బాగానే చేస్తుంటాడు నితిన్‌. అయితే.. ప‌వ‌న్‌కి సంబంధించిన ఓ అంశం మాత్రం నితిన్‌కి అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. అదేమిటంటే.. ప‌వ‌న్‌తో ప‌నిచేసిన డైరెక్ట‌ర్ల‌తో నితిన్ కూడా ప‌ని చేస్తే పాజిటివ్ రిజ‌ల్ట్ మాత్రం రాలేదు. పూరీ జ‌గ‌న్నాధ్‌, క‌రుణాక‌ర‌న్ విష‌యంలో..గ‌తేడాది రిలీజైన హార్ట్ ఎటాక్‌, చిన్న‌దానా నీకోసం సినిమాల‌తో ఈ విష‌యాన్ని అనుభ‌వంలోకి తెచ్చుకున్న నితిన్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి త్రివిక్ర‌మ్ విష‌యంలోనూ 'అ..ఆ..' సినిమా ద్వారా దాన్ని కంటిన్యూ చేస్తాడా? లేదంటే త్రివిక్ర‌మ్ నే ఈ అంశానికి బ్రేక్ వేస్తాడా? దీనికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

More News

సమంత.. రెండు హ్యాట్రిక్ ముచ్చట్లు

ఈ జనరేషన్ లో సక్సెస్ రేట్ ని బాగా మెయిన్ టెయిన్ చేసిన నాయిక సమంత.అందుకే అటు టాప్ డైరెక్టర్లు,ఇటు టాప్ స్టార్స్ ఆమెతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

'మేము' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య

‘పసంగ,మెరీనా,కేడి బిల్లా-కిలాడి రంగా’వంటి బ్లాక్బస్టర్స్ తో ‘స్టార్ డైరెక్టర్’ఇమేజ్ సొంతం చేసుకొన్న పాండీరాజ్ దర్శకత్వంలో..తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం‘పసంగ-2.

నన్ను మించిన మాస్ డైరెక్టర్ ఉన్నాడా...

గమ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాలతో మంచి సినిమాల దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ క్రిష్.

ర‌వితేజ ఎన్నాళ్లెన్నాళ్ల‌కు

మాస్ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఎక్కించే అంశాల్లో ఒక‌టి ఏమిటంటే.. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి మ‌న హీరో మాంచి హుషారైన సాంగేసుకోవ‌డం. ఇప్పుడు ఇదే ఫార్ములాని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కూడా అప్ల‌య్ చేస్తున్నాడు

వెండితెర అద్భుతం.. బాహుబ‌లి శ‌త‌దినోత్స‌వం

తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా...ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దాదాపు 600 కోట్లు పైగా వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.