చరణ్‌తో మాటల మాంత్రికుడు..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో భారీ హిట్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమా త్రివిక్రమ్ ఎవరితో చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు కానీ.. మీడియా వర్గాల్లో మాత్రం చాలా వార్తలే వినపడుతున్నాయి. నిజానికి మెగాస్టార్‌తో త్రివిక్రమ్ సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. కానీ చరణ్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నాడని టాక్. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఇద్దరు కలుసుకున్నారని వార్తలు వినపడుతున్నాయి. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని వార్తలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం చరణ్ కోసం త్రివిక్రమ్ లైన్, ఓ పది నిమిషాల కథను అనుకున్నాడట. అంతా ఓకే అయితే తర్వాతే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి సమయం పట్టేలానే ఉంది. ఈలోపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాను త్రివిక్రమ్ పూర్తి చేస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ను పూర్తి చేసిన తర్వాతే ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com