త్రివిక్రమ్ ఖాతాలో మరో యంగ్ హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను అందుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం మరో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న నానితో త్రివిక్రమ్ ఓ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని సమాచారమ్.
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు యువ కథానాయకులు తరుణ్‌తో నువ్వే నువ్వే, నితిన్‌తో అఆ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన త్రివిక్రమ్.. నానితోనూ ఆ మ్యాజిక్‌ను కొనసాగిస్తారేమో చూడాలి.
త్వరలోనే నాని, త్రివిక్రమ్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం, నాగ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments