ఎన్టీఆర్ లాగే త్రివిక్రమ్ కూడా హిట్ కొడతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు వారికి ఇష్టమైన పండగ అంటే.. అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ పండగ సమయంలో విజయం సాధిస్తే ఏడాదంతా విజయలక్ష్మి వారితో ఉంటుందని నమ్మకం. ఆ నమ్మకం సినీ పరిశ్రమలో కూడా ఉంది. అందుకే ప్రతీ సంక్రాంతి పండగకి సినిమాలను విడుదల చేసి విజయం సాధించాలని దర్శక,నిర్మాతల దగ్గరనుంచి నటీనటులవరకు ఆరాటపడుతూ ఉంటారు.
ఇదే బాటలో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తొలి సంక్రాంతి ప్రయత్నంగా.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేసిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఆశించినంత విజయాన్ని అందివ్వకపోగా.. కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే.. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల నుంచి నిరవధికంగా చిత్రీకరణ కూడా జరుపుకోనుంది.
కాగా, తొలుత ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల అది సంక్రాంతికి వాయిదా పడేలా ఉందని సమాచారం. అంటే.. త్రివిక్రమ్ తదుపరి చిత్రం కూడా మళ్ళీ సంక్రాంతికే రానుందన్నమాట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. త్రివిక్రమ్ ప్రస్తుత సినిమాలో హీరో అయిన ఎన్టీఆర్ తొలి సంక్రాంతి ప్రయత్నం 'నా అల్లుడు' కూడా పరాజయంగా నిలిచిందే. ఆ తరువాత వచ్చిన 'అదుర్స్'తో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే త్రివిక్రమ్ కూడా తొలి ప్రయత్నంతో ఫ్లాప్ అయినా.. రెండో ప్రయత్నంతో సంక్రాంతి విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com