అక్కినేని హీరోతో మాంత్రికుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక లైలా కోసం` చిత్రం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటూనే కొత్త కథలను వింటున్నాడు. త్వరలోనే మాటల మాంత్రికుడుగా పేరున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. సన్నాఫ్ సత్యమూర్తి` సినిమా తర్వాత త్రివిక్రమ్ నాగచైతన్యతో సినిమా చేయడం అక్కినేని అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు)నిర్మించనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com