Mahesh - Trivikram: షూటింగ్ స్పాట్లో బ్యాట్ పట్టుకున్న త్రివిక్రమ్.. వీడియో వైరల్, మహేశ్ ఫ్యాన్స్ ఫన్నీ పోస్ట్‌లు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాను తెరకెక్కించడమంటే మామూలు విషయం కాదు. షూటింగ్, సెట్స్, ప్రొడక్షన్, సవాలక్ష తలనొప్పులు. అందుకే ఆ టెన్షన్స్ నుంచి రిలాక్స్ అవ్వడానికి పలు వ్యాపకాలవైపు వెళుతూ వుంటారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేశ్ బాబులు క్రికెట్ ఆడారు. వివరాల్లోకి వెళితే.. అల వైకుంఠపురం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మహేశ్‌తో ‘‘ఎస్ఎస్ఎంబీ 28’’ తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. అటు మహేశ్ సైతం ‘‘సర్కార్ వారి పాట’ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల కీలకపాత్రలో కనిపించనుంది.
ఇటీవలే యూనిట్‌తో జాయిన్ అయిన మహేశ్ :
తన ఇంట్లో వరుస విషాదాల నేపథ్యంలో కొద్దిరోజుల క్రితమే మహేశ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబీ 28 మూవీ సెట్‌కు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఎప్పుడు డైరెక్షన్ పనుల్లో బిజీగా వుండే త్రివిక్రమ్ షూటింగ్ విరామ సమయంలో మూవీ టీంతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనికి మహేశ్ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే లేట్ అయ్యింది.. ముందు సినిమా సంగతి చూడండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
క్రికెట్ ఆడుతోన్న మహేశ్ :
ఇదిలావుండగా.. త్రివిక్రమ్ వీడియో వైరల్ అయిన ఒకరోజు గ్యాప్‌లోనే మహేశ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో సూపర్‌స్టార్ ఓ ఫామ్‌హౌస్‌లో పచ్చని చెట్ల మధ్య బ్యాట్ పట్టుకుని షాట్లు కొడుతున్నారు. అయితే ఇది ఇప్పటిది కాదని సమాచారం. పాత వీడియోను మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
“Ee bat mari chinnaga vundandi” 😊
— Super⭐️ Fan 🦁 (@Ravianenenu) February 2, 2023
Meher : “Ben Stokes” 🔥
Cut shot 😍 . #SarileruNeekevvaru #SSMB28 https://t.co/Jn7pW1ILtI pic.twitter.com/hPziEQxtRJ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com