త్రివిక్రమ్ డబుల్ ధమాకా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏడాదికో సినిమా.. లేదంటే రెండు మూడేళ్లకో సినిమా.. ఇలా ఉంటుంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చే సినిమాల పరిస్థితి. అలాంటి త్రివిక్రమ్ వచ్చే ఏడాది తన అభిమాలకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజింగ్ షాక్ ఇవ్వనున్నారా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. కాస్త వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాత వాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
కీర్తి సురేష్, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతమందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ హీరోగా తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు త్రివిక్రమ్. మార్చిలో సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే గనుక జరిగితే.. ఒకే ఏడాదిలో త్రివిక్రమ్.. దర్శకుడిగా డబుల్ ధమాకా ఇవ్వనున్నట్లే. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments