పవన్ సినిమాకి త్రివిక్రమ్ సెంటిమెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
'జల్సా', 'అత్తారింటికి దారేది' వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌కి నేరుగా పరిచయమవుతున్నాడు.
ఇదిలా ఉంటే.. మ్యూజిక్ డైరెక్టర్‌ల విషయంలో త్రివిక్రమ్‌కి ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఏ మ్యూజిక్ డైరెక్టర్ తొలిగా పనిచేసినా విజయం తథ్యం. 'నువ్వే నువ్వే' చిత్రంతో కోటి.. 'అతడు'తో మణిశర్మ.. 'జల్సా'తో దేవిశ్రీప్రసాద్.. 'అఆ'తో మిక్కీ జే మేయర్ ఈ విషయాన్ని నిరూపించారు. ఆ లెక్కన త్రివిక్రమ్ కొత్త చిత్రానికి అనిరుధ్ మొదటిసారిగా పనిచేయడమన్నది కలిసొచ్చే అంశమే. మరి పవన్ 25వ చిత్రానికీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com