త్రివిక్ర‌మ్ కి కూడా ప‌వ‌న్ చెప్ప‌లేద‌ట‌..

  • IndiaGlitz, [Monday,March 21 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇద్ద‌రూ మంచి మిత్రులు. వీరిద్ద‌రు క‌ల‌సి జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు చేసారు. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య సాన్నిహిత్యం మ‌రింత పెరిగింద‌నే విష‌యం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే..త్రివిక్ర‌మ్ రెండు సార్లు స‌ర్ధార్ సెట్స్ కి వెళ్లాడ‌ట‌. కానీ...ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కి స‌ర్ధార్ క‌థ గురించి కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సీన్స్ గురించి కానీ ఏది చెప్ప‌లేద‌ట‌. సర్ధార్ సెట్ లో త్రివిక్ర‌మ్ వ‌చ్చిన‌ప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కి అప్ప‌టి వ‌ర‌కు తీసిన‌ సీన్స్ చూపిస్తుంటే...ప‌వ‌న్ ఎందుకు చూపిస్తున్నావ్ అంటూ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పై ఫైర్ అయ్యాడ‌ట‌.

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ లో త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ...స‌ర్ధార్ సినిమా గురించి నాకు ఏమీ తెలియ‌దు. అభిమానులు ఎలాగైతే స‌ర్ధార్ సినిమా గురించి ఎదురుచూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నాను అన్నారు. త్రివిక్ర‌మ్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తుంటే...ప్ర‌చారంలో ఉన్న‌ట్టు నిజంగానే త్రివిక్ర‌మ్ కి ప‌వ‌న్ స‌ర్ధార్ క‌థ గురించి ఏమీ చెప్ప‌లేద‌ని తెలుస్తుంది. అత్యంత స‌న్నిహితంగా ఉండే త్రివిక్ర‌మ్ కి ప‌వ‌న్ స‌ర్ధార్ సినిమా గురించి ఏమీ చెప్ప‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో...ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ కే తెలియాలి.

More News

ఏప్రిల్ 1న విడుదలవుతున్న పిడుగు

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం 'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఆలీ కాస్త తెలుసుకుని మాట్లాడు...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ త‌ల‌కు ఎర్ర‌తువాలు క‌ట్టుకున్నారు. ప‌వ‌న్ తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కూడా ఎర్ర‌తువాల‌ను ఉప‌యోగించారు.

మ‌నోజ్ ఎటాక్ డేట్ ఫిక్స్

మంచు మ‌నోజ్ - బీరువా ఫేం సుర‌భి జంట‌గా న‌టించిన చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎటాక్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, వ‌డ్డే న‌వీన్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో కమల్ మూవీ

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గతేడాది రమేష్ అరవింద్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఈ చిత్రం కమల్ హాసన్ తన గురువు కె.బాలచందర్ గారితో నటించిన ఆఖరిచిత్రం కూడా ఇదే. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదలైంది. పవన్ కల్యాణ్ జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన చిత్రమిది.