తారక్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతుందా..? ఔననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం అలవైకుంఠ పురం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.... రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఫిబ్రవరి కల్లా ఫ్రీ కానున్నారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతుంది అనేది ఫ్యాక్ట్. సో... త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట.
దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట. తన మార్క్ నుంచి బయటకు వచ్చి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసే మూవీ కంటెంట్ అదిరిపోతుందని టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పెరిగే జూనియర్ పరిధిని త్రివిక్రమ్ ఇలా క్యాష్ చేసుకోబోతున్నాడు అన్న మాట. అరవింద సమేత మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్... మరో సారి సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com