త్రివిక్రమ్ నూతన చిత్రం 'అ ఆ'
Send us your feedback to audioarticles@vaarta.com
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందించనున్న చిత్రం పేరు ఇది.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు.
నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). వరుసగా 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).
సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్ , సమర్పణ శ్రీమతి మమత , నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) , కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com