త్రివిక్రమ్ విడుదల చేసిన వనవాసం పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం 'వనవాసం'. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లో శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రముఖ డైరెక్టర్ "త్రివిక్రమ్" గారి చేతుల మీదగా పోస్టర్ మరియు టైటిల్ లాంచ్ చేసారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ "త్రివిక్రమ్" గారు మాట్లాడుతూ నాకు ఈ టైటిల్ బాగా నచింది. ఈ టైటిల్ లాగానే సినిమా కూడా బాగుంటుంది అని ఆశిస్తున్నాను అంటూ టీం అందరికి All the best చెప్పారు.
భరత్ కుమార్.పి నరేంద్ర మాట్లాడుతూ త్రివిక్రమ్ గారు మా సినిమా టైటిల్ ని మెచ్చుకోవడం చాల ఆనందం గా ఉంది. కొని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
నిర్మాత "సంజయ్ కుమార్ . బీ" మాట్లాడుతూ సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు తొందర్లోనే ఈ సినిమా ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత "సంజయ్ కుమార్. బీ" చెప్పారు.
సంగీతం :ఎం.ఎం.కుమార్, సినిమాటోగ్రఫీ : ప్రేమ్ జై విన్స్Oట్ , ఎడిటర్ : ప్రభు, పోస్టర్స్ మరియు ట్రైలర్ : నాగ విజయ్ కుమార్.ఎం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com