'శుభలేఖ+లు' రెండవ ట్రైలర్‌ని ఆవిష్కరించిన త్రివిక్రమ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం.పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫర్స్‌తో వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకుని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా సినిమా రెండో ట్రైలర్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రిమిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవలె విడుదలైన మా ట్రైలర్ కిగాని, టీజర్‌కిగాని ఇంత అద్భుతమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇండస్ర్టీలో ఉన్న పెద్దలందరూ చూసి తమ మాటల్లో మంచి పోజిటివ్ ఎనర్జీని అందిస్తున్నారు. ఇంత మంది ప్రముఖుల ఆదరణ ఈ సినిమాకి లభించడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా ట్రైలర్‌ని మేము అడిగిన వెంటనే త్రివిక్రమ్‌గారు విడుదల చేయడం చాలా సంతోషం ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు విద్యాసాగర్, జనార్ధన్, బెల్లం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నటీనటులుః శ్రీనివాస్‌సాయి, ప్రియవడ్లమాని, దీక్షశర్మరైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజిఅంబరీష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలుః విద్యాసాగర్, జనార్ధన్ ఆర్.ఆర్, కథ-మాటలుః జనార్ధన్ఆర్.ఆర్-విస్సు,కథాసహకారంఃసి.విద్యాసాగర్,స్క్రీన్‌ప్లే-డైరెక్షన్ఃశరత్‌నర్వాడే, సంగీతంఃకె.యం.రాధాక్రిష్టన్, డైరెక్షన్ ఆఫ్ ఫొటోగ్రఫీఃయస్.మురళీమోహన్‌రెడ్డి, ఆర్ట్‌డైరెక్టర్ఃబ్రహ్మకడలి, ఎడిటర్ఃమధు, కొరియోగ్రఫీఃచంద్రకిరణ్, పి.ఆర్.ఓఃపులగం చిన్నారాయణ, వీరబాబు బాసిశెట్టి, పబ్లిసిటి డిజైనర్ఃసుధీర్, స్టిల్స్ఃరఘు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ఃసూర్యనారాయణకరుటూరి, కో-డైరెక్టర్ఃఎం.సర్వేశ్వరరావు, ప్రొడక్షన్‌కంట్రోలర్ఃప్రవీణ్‌పాలకుర్తి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments